TG: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వేదికగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని TRS అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఓయూ విద్యార్థులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినచ్చిందని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి కృషి చేసిన విద్యార్థి సోదర, సోదరీమణులకు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వార్తలు
ఓయూలో బతుకమ్మ వేడుక సంతోషకరం: కవిత


