హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండీ కూటమి మార్చ్‌.. సీజేఐ భేటీకి నిరాకరణ!

ఇండీ కూటమి నేతలను వ్యక్తిగతంగా కలిసేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఈ మేరకు కారణాలు వివరిస్తూ సీజేఐ కార్యాలయం వారికి మెయిల్ ద్వారా సమాధానం పంపింది. సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించాలని కూటమి పిలుపునిచ్చిన నేపథ్యంలో, సీజేఐ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మార్చ్ నిర్వహణపై ప్రస్తుతం తీవ్ర సందేహాలు, ఉత్కంఠ నెలకొన్నాయి.