హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారులపై ముళ్ల పొదలు

PLD: దాచేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపైకి ముళ్ల కొమ్మలు విస్తరించడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.