హైదరాబాద్: 28°C
వార్తలు

గిద్దలూరులో నేడు ఎమ్మెల్యే పర్యటన

ప్రకాశం: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నేడు గిద్దలూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు టీడీపీ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ, 10 గంటలకు పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించిన శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు తిరుమల కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే కిసాన్ మేళాలో రైతులను సన్మానిస్తారని ఆయన కార్యలయం తెలిపింది.