దేశంలోని యువత శనివారం శాంతియుతంగా నిరసన తెలిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ పోలీసులు, బీజేపీ గూండాలు వారిపై దాడి చేశారని ఆరోపించారు. పార్టీలు, వర్గాలకతీతంగా సోమవారం ర్యాలీగా సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడించారు. యువత, అన్ని ప్రతిపక్ష పార్టీలు తమతో కలిసి వస్తారని తెలిపారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJIకి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు.
వార్తలు
రేపు సుప్రీంకోర్టుకు ర్యాలీ: రాహుల్ గాంధీ


