హైదరాబాద్: 28°C
వార్తలు

తుమ్మలపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

BPT: కర్లపాలెం మండలం తుమ్మలపల్లిలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాపట్ల ఎస్పీ ఆదేశాలతో ఎస్సై, 30 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.