హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ముస్లింలు

MBNR: జడ్చర్ల పాత బజార్ ఈద్గా అభివృద్ధికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులు అందించినట్లు తెలిపారు. అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.