ADB: ఆదిలాబాద్ మార్కెట్ కు పత్తి కొనుగోలు నేపథ్యంలో వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రైతులకు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు, తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ఆధార్ లింక్, ఈ-కేవైసి పూర్తి చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
వార్తలు
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: శ్రీకాంత్ రెడ్డి


