హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్ర కుట్ర కేసులో మరో నిందితుడిని అరెస్ట్

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నిన కేసులో NIA మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. నిషేధిత జమాత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (JMB) అనుబంధ సంస్థ ఇమామ్‌ మహ్ముదర్‌ కఫీలా (IMK) కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకుంది. నిందితుడి నుంచి ఫోన్లు, మెమరీ కార్డులు వంటి డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకుంది.