హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో మృతదేహం వెలికితీత

PDPL: ధర్మారం గణేష్ నగర్‌లో ఓ వృద్ధురాలి మృతి కలకలం రేపింది. శనివారం మృతిచెందిన వృద్ధురాలు గంగాధర లక్ష్మి మృతదేహాన్ని కుటుంబం పూడ్చిపెట్టింది. ఓ మహిళ అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. తహసీల్దార్ శ్రీనివాస్ సమక్షంలో మృతదేహం వెలికితీసి రామగుండం వైద్యులు పోస్టుమార్టం చేశారు. నేరం రుజువైతే అరెస్టు చేస్తామని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.