హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవానీగూడలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

ADB: వందేళ్ల చరిత్ర కలిగిన బేల మండలం భవానీగూడలోని ప్రసిద్ధ భవానిమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీటి వంటి ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.