హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: జన విజ్ఞాన వేదిక

NRPT: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యుడు మహేందర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన వేదిక 6వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్, రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతలో పర్యావరణంపై అవగాహన పెంచాలని సూచించారు.