హైదరాబాద్: 28°C
వార్తలు

30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

PDPL: ఓదెల మండలం పోత్కపల్లిలో 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్ రెడ్డి రజినీకాంత్ గౌడ్తో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్పత్రి ఏర్పాటుతో వివిధ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.