KMM: సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారి దీక్ష స్వీకరించారు. అమ్మవారి మాలలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత గణపతి పూజ నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని ఆరాధించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సాయిబాబా ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు


