హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి రాత పరీక్ష

JN: జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించారు. ఈ పోస్టుల భర్తీకి మొత్తం 697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 602 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 95 మంది గైర్హాజరయినట్లు తెలిపారు.