హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

SRPT: కోదాడ పట్టణంలోని సిరి అపార్ట్‌మెంట్ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న సావిత్రి అనే మహిళ మెడలో నుంచి ఈరోజు ఇద్దరు దుండగులు బంగారు గొలుసు అపహరించారు. సిగరెట్లు కొనుగోలు చేసే నెపంతో వచ్చి, మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి చోరీకి పాల్పడి బైక్‌పై పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన కోదాడ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.