హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా కలప తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత

MHBD: మరిపెడ పోలీసులు తనిఖీల్లో అక్రమంగా సండ్ర కలప తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనేపురం – గిరిపురం రోడ్డుపై అనుమతులు లేకుండా సూర్యాపేటకు కలప తరలిస్తుండగా గుర్తించి, ట్రాక్టర్‌తో పాటు కలపను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో సూర్యాపేట జిల్లాకు చెందిన గుగులోత్ రమేష్, దారావత్ సాయిగా గుర్తించారు.