హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరాకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి'

SRCL: దసరా పండుగకు ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమన్నారు. తాళాలు కనిపించకుండా ఉంచడం, విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో దాచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఒక గదిలో లైట్ వెలిగేలా చేయాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100/112కు సమాచారం ఇవ్వాలన్నారు.