హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి లాభాలను బహిర్గతం చేయాలి'

PDPL: సింగరేణి సంస్థ ఆర్జించిన అసలు లాభాలను బహిర్గతం చేయాలని CITU నేత మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖని చౌరస్తాలో కార్మికులతో కలిసి ఈరోజు నిరసన తెలిపారు. దసరా పండుగలోపు కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని కోరారు. SCEU-CITU నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.