హైదరాబాద్: 28°C
తెలంగాణ

జెన్ జీతో ముచ్చటించిన మాజీమంత్రి హరీశ్!

SDPT: సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు జెన్ జీ తరంతో ముచ్చటించారు. యువత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే ఇంకో 30 ఏళ్లు అయినా సిద్దిపేటకు నీళ్లు వచ్చేవి కావని అన్నారు. గోదావరి నదికి 400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి కాళేశ్వరం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని తేగలిగిందని గుర్తు చేశారు.