హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ

JGL: ప్రజాసేవే తన లక్ష్యమని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం బీర్పూర్ మండలం మంగేళలో సొంత ఖర్చులతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తన ఎదుగుదలకు సహకరించిన ప్రజల ఆశీర్వాదమే తన బలమన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.