హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: బీజేపీ

GDWL: పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం అయిజ మండలం పులికల్‌, రాజాపూర్‌ గ్రామాల్లో పట్టభద్రులకు అవగాహన కల్పించారు. ఓటు నమోదుకు మరో 22 రోజులే గడువు ఉందని తెలిపారు. గతంలో నమోదు చేసుకున్నవారు సైతం మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు.