హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల హైవే వద్ద ఉన్న శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం MLA గడ్డం వినోద్ ఆలయానికి విచ్చేసి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పట్టణం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.