BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరంలోని శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి బాలాలయంలో ఆదివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 19వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు చండీ హోమం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రారంభ పూజల్లో ఈఓ మహేష్, చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ధర్మకర్తలు, పాల్గొన్నారు.
తెలంగాణ
కాళేశ్వరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు


