BHPL: గణపురం మండలం బుద్ధారంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గామాత ఉత్సవాల్లో ఎమ్మెల్యే గండ్ర దంపతులు


