హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

SDPT: గజ్వేల్‌లో నిర్వహించిన మాజీ సైనికుల సంక్షేమ సంఘం రెండో వార్షికోత్సవంలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని ఆయన అన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్లు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.