హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

WNP: కొత్తకోటలో శ్రీశ్రీశ్రీ భవాని శంకర్ దేవాలయంలో ఘనంగా దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణతో అమ్మవారికి వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.