హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారి రిషికి అండగా న్యాయసేవలు

KNR: శిశుగృహంలో సంరక్షణ పొందుతున్న ఆరు నెలల రిషి కంటి సమస్యను గుర్తించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఈ నెల 7న చిన్నారికి కుడి కంటికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇతర పిల్లల ఆరోగ్యం, హక్కులు, సంక్షేమంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.