హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి'

WGL: చెన్నారావుపేట మండలంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన యాసంగి మొక్కజొన్నకు సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్, బార్ధాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని MCPIU మండల కార్యదర్శి జన్ను రమేష్ డిమాండ్ చేశారు. ఐదు నెలలైనా చెల్లింపులు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డబ్బులు జమ చేయకుంటే అందరూ అలా చేపడతామని అన్నారు.