హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం

MNCL: సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు జన్నారం మండలం ప్రజా ప్రతినిధులు, రైతులు రావాలని వ్యవసాయ అధికారి వీరన్న కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎల్నీనో ప్రభావం, యాసంగి పంటల ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సోమవారం ఉదయం 11 గంటలకు పోన్కల్ రైతు వేదికలో ఉంటుందన్నారు. ఇందులో సీఎం రైతులకు సూచనలు చేయడం జరుగుతుందన్నారు.