హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెట్టిచాకిరి నిర్మూలనపై కళా ప్రదర్శన

ASF:కాగజ్ నగర్ పట్టణం, అంబేడ్కర్ చౌరస్తాలో వెట్టిచాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కళా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి 30వ డివిజన్ కౌన్సిలర్ మాణిక్యరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 08069434343 హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలన్నారు. గజవెల్లి ప్రతాప్ బృందం ప్రదర్శనలతో కార్మికులకు అవగాహన కల్పించారు.