KMM: ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదివారం కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భూగర్భ జలమట్టాలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు.
తెలంగాణ
ఎల్‌నినో పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి


