హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: వనమహోత్సవంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ 3,14వ వార్డుల్లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కమిషనర్ గిరీష్ మహిళలు, చిన్నారులకు పండ్ల, పూల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. పచ్చదనం పెంపొందించి జడ్చర్లను హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. వార్డు ఆఫీసర్ కృష్ణయ్య పాల్గొన్నారు.