హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మూడేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం'

RR: కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ నేత ప్రేమ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం లేకపోయినా మూడేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.