హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

SRCL: తంగళ్లపల్లి మండలం సారంపల్లి–నేరెళ్ల గ్రామాల మధ్య ఉన్న పాల కేంద్రం వద్ద కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.