హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. కొండకింద కల్యాణ కట్ట, వ్రత మండపం, కొండపైన ఆలయ తిరువీధులు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు క్యూలైన్‌ల‌లో బారులు తీరి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.