హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగవరం శివారులో బైక్ చోరీ

WNP: బొల్లారం గ్రామానికి చెందిన వేముల వంశీకుమార్‌ బైక్‌ (TS 31 C 2685) నాగవరం శివారులోని సితార గ్రాండ్ హోటల్‌ వద్ద చోరీకి గురైంది. అక్టోబర్‌ 5వ తేదీ రాత్రి బైక్‌ పార్క్‌ చేసి హోటల్‌లో నిద్రించిన ఆయన, మరుసటి రోజు తెల్లవారుజామున బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రిషికేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.