KMR: గాంధారిలో అర్ధరాత్రి దొంగలు SBI ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. ప్రధాన రహదారిపై ఉన్న ఏటీఎంలోకి నల్లరంగు స్కార్పియోలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. చోరీకి గురైన నగదు ఎంతనేది తెలియాల్సి ఉంది. ఘటనాస్థలాన్ని అడిషనల్ SP నరసింహరెడ్డి, బాన్సువాడ DSP, SI మహేందర్ పరిశీలించారు.
తెలంగాణ
SBI ఏటీఎంను పరిశీలిస్తున్న అడిషనల్ ఎస్పీ


