హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో పెద్దమ్మ

BDK: పాల్వంచ జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలు పాల్వంచ పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.