హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మిషన్ భగీరథ నీరు బంద్!

మహబూబ్‌నగర్ నగరంలో రేపు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రామిరెడ్డిగూడెం ట్రాన్స్‌ఫార్మర్ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల మార్పిడి, ధర్మాపూర్ సమీపంలో 945 ఎంఎం పైప్‌లైన్ మరమ్మతులతో సరఫరా నిలిచిపోనుంది. తిరిగి మంగళవారం సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.