హైదరాబాద్: 28°C
వార్తలు

మెట్రో సేవలను పునరుద్ధరించాలి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మెట్రో రైలు సేవలను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. అలాగే దేశ రాజధానిలో నిలపివేసిన ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించాలని సూచించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగనంత వరకు మెట్రో సేవలను కొనసాగించాలని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే మెట్రో సేవలను నిలిపివేయాలని చెప్పింది. అలాగే బారికేడ్లను తొలగించాలని పేర్కొంది.