హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రత్యేక పూజలు అందుకున్న అన్నపూర్ణేశ్వరి దేవి

CTR: దసరా వేడుకలలో భాగంగా పుంగనూరు పట్టణం మినీ బైపాస్‌లో గల శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం అర్చకులు అమ్మవారి మూలములను అభిషేకించి కంచి కామాక్షి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.