హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విమానాశ్రయంలో శరన్నవరాత్రి పూజలు

కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దుర్గమ్మవారి శరన్నవరాత్రి పూజలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రయాణాల కారణంగా ఇంటి వద్ద అమ్మవారి పూజల్లో పాల్గొనలేకపోతున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో నిర్వహించిన పూజలు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. దుర్గమ్మవారి ఆశీస్సులు పొందేలా ఏర్పాటు చేసిన ఈ పూజలు ప్రయాణికుల్లో భక్తిభావాన్ని నింపాయి.