KMM: ఖమ్మంలో విద్యుత్ లైన్లపై, తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని కేబుల్ ఆపరేటర్లను విద్యుత్ శాఖ ఆదేశించింది. రోటరీ నగర్‌లో కేబుల్ వైర్ల కారణంగా 33 కేవీ లైన్ కాలిపోయి సరఫరా నిలిచిపోయిన ఘటనను ప్రస్తావించింది. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ఆపరేటర్లు స్పందించకుంటే విద్యుత్ సిబ్బందే స్వయంగా కేబుళ్లను తొలగిస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణ
'విద్యుత్ లైన్లపై అనధికారిక కేబుళ్లు తొలగించాలి'


