VKB: నవాబ్‌పేట మండల కేంద్రం నుంచి వట్టిమీనెపల్లి వరకు సుమారు 3 కి.మీ. మేర ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో రోజూ సుమారు 2 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిరుజల్లులు కురిసినా వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా నవాబ్‌పేట ప్రధాన రహదారి


