హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ జీవన విధానంపై విద్యార్థుల క్షేత్ర సందర్శన

JN: హైదరాబాద్‌లోని బీరంగూడకు చెందిన జెనెసిస్‌ పాఠశాల విద్యార్థులు 150 మంది శనివారం జఫర్‌గఢ్‌ మండలం తిడుగు గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలు, సంప్రదాయ వృత్తులు, సంస్కృతి, ఆటపాటలు, పండుగల గురించి తెలుసుకునేందుకు క్షేత్ర సందర్శన చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. సర్పంచ్‌ గోపు సోమయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.