ASF: బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలో పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని కార్యదర్శి వైకుంఠం తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా పశువులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ఈ మేరకు పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి డప్పు చాటింపు వేయించింది. పశువులను సాయంత్రం బయటకు వదలకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదన్నారు.
తెలంగాణ
VIDEO: పశువులను బయట వదిలితే జరిమానా తప్పదు


