హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

GDWL: ఈనెల 12న నిర్వహించాల్సిన డివిజన్, మండల స్థాయి ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో పంటల బాగోగులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.