ADB: విద్యా నగర్‌లో బతుకమ్మ సందడి నార్నూర్ పట్టణంలోని విద్యా నగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మోడల్ స్కూల్ సమీపంలో శనివారం సాయంత్రం మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళలంతా ఒకచోట చేరి ఆనందంగా వేడుకల్లో పాల్గొనడంతో కాలనీలోపండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
విద్యానగర్‌లో బతుకమ్మ సందడి


