ASF: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దహెగాం నుంచి సలుగుపల్లి వైపు టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై తరలిస్తున్న రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


